తెలంగాణ

పున్న కైలాష్ నేత కే MLA టికెట్

మధ్యంతర ఎన్నికలు రానున్నాయనే వార్తలు గుప్పుమంటుండగా అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పని చేస్తున్న తీరుపై, అభ్యర్థుల బలాబలాలను అంచనా వేయడానికి ఇప్పటికే అనేక సర్వేలు చేయించినట్లు తెలుస్తుంది. ఆ మేరకు ఢిల్లీ పెద్దల నుండి కూడా అనుమతి తీసుకునేందుకు రాష్ట్ర నాయకత్వం లేఖ రాసినట్లు తెలుస్తుంది.

మునుగోడు నియోజకవర్గ MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారినా, MP అభ్యర్థి గా పోటీ చేసినా అక్కడ ఓయూ విద్యార్ధి ఉద్యమ నేత, పిసిసి అధికార ప్రతినిధి పున్న కైలాష్ నేత కి టికెట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఇప్పటికే రెండు సార్లు టికెట్ ఆశించి భంగపడ్డారు. స్థానికుడు, విద్యావంతుడు, మునుగోడు నియోజకవర్గంలోనే అత్యధిక ఓట్ల శాతం కలిగిన పద్మశాలి వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఏ సారి కాంగ్రెస్ పార్టీ నుండి మునుగోడు ఎమ్మెల్యే టికెట్ కైలాష్ నేత కే దక్కుతుందని విశ్వసనీయ సమాచారం.