ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

అగ్నిప‌థ్ .. రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద హై అల‌ర్ట్.. 144 సెక్షన్

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన అగ్నిప‌థ్ వ్యవహారంలో తలెత్తిన విధ్వంసాల కారణంగా ఏపీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రైల్వేస్టేషన్లే లక్ష్యంగా జరుగుతున్న దాడులను అరికట్టేందుకు రైల్వే స్టేషన్ల ఎదుట 144 సెక్షన్‌ను విధించారు. ఇవాళ భారత్‌ బంద్‌ పిలుపులో భాగంగా ఆర్‌సీఎఫ్‌ పోలీసులతో పాటు సివిల్ పోలీసులు, ఇతర పోలీసు బలగాలతో బందోబస్తును మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ఏపీలోని ప్రధాన నగరాలైన విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, తదితర ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్టాండ్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానాస్పద స్థితిలో ఉన్న ప్రయాణికులను తనిఖీలు చేస్తున్నారు.