మహారాష్ట్రలో పెట్రోల్ రూ. 5, డీజిల్ పై రూ. 3 తగ్గింపు
మహారాష్ట్రలో పెట్రోల్. మహారాష్ట్ర ప్రజలకు సిఎం ఏక్‌నాథ్ షిండే శుభవార్త తెలిపారు. భారీగా పెరిగిన ఇంధన ధరల విషయంలో కొంత ఊరట కల్పించారు. మహారాష్ట్రలో లీటరు పెట్రోలుపై రూ. 5, డీజిల్ పై రూ. 3 తగ్గిస్తూ షిండే సర్కారు నిర్ణయం తీసుకుంది. ముంబైలో గత పదకొండు రోజులుగా రూ. 111.35 గా ఉన్న లీటరు పెట్రోలు తాజా తగ్గింపుతో రూ. 106.35కు తగ్గనుంది. ఇప్పటిదాకా రూ. 97.28గా ఉన్న లీటరు డీజిల్ ఇకపై 94.28 కే లభించనుంది.
ఇతర నగరాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు ముంబైలోనే ఎక్కువగా ఉండటంతో షిండే సర్కారు తాజా నిర్ణయం తీసుకుంది. బుధవారం నాటికి లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రూ.96.72, కోల్ కతాలో రూ.106.03, చెన్నైలో రూ.102.63, గువాహటిలో రూ. 96.48గా ఉన్నాయి. లీటరు డీజిల్ రేట్లు ఢిల్లీలో రూ.89.62, కోల్ కతాలో రూ.92.76, చెన్నైలో రూ.94.24, గువాహటిలో రూ. 84.37గా ఉన్నాయి. ఇక, హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 109.66 కాగా, డీజిల్ రేటు రూ. 97.82గా ఉంది.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/