నేడు ప్రధాని మోడి ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.14,850 కోట్లతో 296 కిలోమీటర్ల మేర నిర్మించిన నాలుగు లేన్‌ల ప్రతిష్ఠాత్మక బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈమేరకు జలౌన్ జిల్లాలోని తహసిల్‌లోని కైతేరి గ్రామంలో జరిగే కార్యక్రమంలో మోడీ పాల్గొని ఈ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించనున్నారు. దీంతోపాటు పలు పథకాలకు శంకుస్తాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. యూపీ సహా దేశవ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరచడానికి కేంద్రం ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామీణా ప్రాంతాల నుంచి పట్టణాలకు రవాణా, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కోసం ఈ రహదారిని నిర్మించింది.
ప్రధాని మోడీ.. 2020 ఫిబ్రవరి 29న బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేవలం 28 నెలల్లోనే దీని పనులు పూర్తయ్యాయి. 296 కి.మీ విస్తరించి ఉన్న ఈ ఎక్స్ ప్రెస్ వే చిత్రకూట్, ఇటావా మధ్య ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే షెడ్యూల్ కంటే ఎనిమిది నెలల ముందే పూర్తయింది. ఈ ప్రతిష్టాత్మక ఎక్స్‌ప్రెస్ వే చిత్రకూట్, బండా, మహోబా, హమీర్‌పూర్, జలౌన్, ఔరైయా, ఇటావా జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే చిత్రకూట్ జిల్లాలోని భరత్‌కప్, ఆగ్రా- ఇటావా జిల్లాలోని కుడ్రైల్ గ్రామం వరకు విస్తరించి ఉంది. దీనిని లక్నోఎక్స్‌ప్రెస్‌వేకు అనుసంధానంగా నిర్మించారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/