తెలంగాణ ముఖ్యాంశాలు

గోదావరి పరీవాహక ప్రాంతాల్లో రేపు సిఎం కెసిఆర్‌ ఏరియల్‌ సర్వే

గోదావరి పరీవాహక ప్రాంతాల్లో రేపు సిఎం కెసిఆర్‌ ఏరియల్‌ సర్వే

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలు, తద్వారా గోదావరి పరీవాహక ప్రాంతం లో పోటెత్తిన వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్ రేపు (ఆదివారం) ఉదయం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. సిఎం ఏరియల్ సర్వే కడెం నుంచి భధ్రాచలం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతంలో కొనసాగనున్నది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక కార్యక్రమాలను సీఎం నేరుగా పర్యవేక్షించనున్నారు. సిఎం ఏరియల్ సర్వేకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సీఎం చేపట్టే ఏరియల్ సర్వేకు సంబంధించిన విధి విధానాలను పర్యవేక్షించి హెలికాప్టర్ రూట్ ను ఫైనల్ చేయనున్నారు. ఈ సర్వేలో సిఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొననున్నారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/