తెలంగాణ ముఖ్యాంశాలు

కామారెడ్డి లో ఘోర ప్రమాదం : కంటైనర్ లారీని ఢీకొన్న ఆటో.. ఆరుగురు మృతి

కామారెడ్డి లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్లో వెళ్లి కంటైనర్ లారీని ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటన లో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని మద్నూరు మండలం మేనూరులోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి గుజరాత్ కంటైనర్ లారీ వెళ్తుంది. ఈ క్రమంలో మద్నూర్‌ నుంచి బిచ్కుంద వైపు రాంగ్‌రూట్‌లో స్పీడ్ గా వస్తున్న ఆటో..ఒక్కసారిగా కంటైనర్ లారీ ఢీ కొట్టింది. లారీ కూడా స్పీడ్ గా ఉండడం తో స్పాట్ లోనే ఆటో లో ఉన్న ఆరుగురు మృతి చెందారు.

కంటైనర్ డ్రైవర్ తో పాటు క్లినర్ గాయపడ్డారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. లారీ ముందుభాగంలోకి ఆటో చొచ్చుకు వెళ్లడం తో ఆటోలో మృతదేహాలు ఇరుక్కుపోయి, ఘటనా స్థలి భయానకంగా మారింది. ఆటో డ్రైవర్ రాంగ్ రూట్లో రావడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. నలుగురు ప్రయాణించాల్సిన ఆటోలో ఆరుగురిని ఎక్కించుకొని రాంగ్ రూట్లో తీసుకొచ్చాడని చెపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం మరణించిన వారి వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/