వైస్సార్సీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ముగ్గురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై వైఎస్సార్‌సీపీ నుంచి స్పష్టత వచ్చింది. నేరుగా పోటీ చేయాలా లేక ఎవరికైనా మద్దతు ఇవ్వాలా అనే ఆలోచనలో ఉన్న పార్టీ..పోటీ చేసేందుకు డిసైడ్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం వైఎస్ జగన్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉమ్మడి విశాఖ – విజయనగరం – శ్రీకాకుళం గ్రాడ్యుయేట్ స్థానానికి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న ఎస్.సుధాకర్ పేరును ఖరారు చేయగా.. ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు గ్రాడ్యుయేట్ స్థానానికి గూడూరు నియోజకవర్గానికి చెందిన శాంప్రసాద్ రెడ్డిని బరిలో నిలబెట్టనున్నారు. ఇక మూడోది అయిన ఉమ్మడి కర్నూలు – కడప – అనంతపురం గ్రాడ్యుయేట్ స్థానానికి వెన్నపూరు రవి పోటీలో నిలవనున్నారు.
ఈ ఎన్నికలకు సంబంధించి పార్టీపరంగా ఎలా వ్యవహరించాలన్న దానిపై ఒక కార్యాచరణను సిద్ధం చేసే బాధ్యతను నలుగురు ఎమ్మెల్యేలకు సీఎం అప్పగించినట్లు తెలిసింది. ప్రతి ఒక్క ఓటరూ పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటు వేసేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకులదేనని చెప్పారు. టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల ప్రక్రియ కూడా చేపట్టాలని సమావేశం నిర్ణయం తీసుకున్నారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/