యానాంలో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ పర్యటిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. గోదావరి ఉగ్రరూపాన్ని వందలాది ఇల్లు నీట మునిగాయి. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. దీంతో ప్రభుత్వాలు , కేంద్రం వారిని ఆదుకునే పనిలో ఉన్నారు. రీసెంట్ గా భద్రాచలం ముంపు గ్రామాల్లో పర్యటించిన తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్..ఈరోజు మంగళవారం యానాంలో పర్యటిస్తున్నారు.
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో ఈ రోజు ఆమె వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ, బాధితులతో మాట్లాడుతున్నారు. పర్యటన కోసం హైదరాబాద్ నుంచి ఉదయం 8:45 గంటలకు రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో యానంకు వచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యానాంను గోదావరి ముచ్చెత్తింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 25 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని అధికారులు కిందకు విడుదల చేయడంతో యానాం అంత వరద మాయం గా మారింది. అయ్యన్న నగర్ దగ్గర్లో గోదావరి గట్టుకు గండిపడటంతో యానాం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దాంతో కేవలం ముప్పై నిమిషాల్లోనే చాలా కాలనీల్లో నడుము లోతు నీళ్లు వచ్చాయి. యానాంలో అయితే ఇప్పటికీ పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/