నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల శివసేన పార్టీలో అసమ్మతి స్వరాలు మొదలవడం,శివసేన నాయకుడు ఏక్ నాథ్ షిండే నేతృత్వంలొ ఆ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేయడం.. ఆ తర్వాత బీజేపీ మద్దతులో ఏక్ నాథ్ షిండే సీఎం పగ్గాలు చేపట్టడం,ఇష్టం లేకపోయినా బీజేపీ ఆదేశాల మేరకు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్..షిండే కేటినెట్ లో డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహించడం జరిగింది.
ఎన్‌సీపీలోని అన్ని విభాగాలు, సెల్స్‌ను రద్దు చేశారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రఫుల్ పటేల్ ట్వీట్ చేశారు. ‘ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ ఆమోదంతో తక్షణమే అన్ని విభాగాలు, సెల్స్ రద్దయ్యాయి.’ అని పేర్కొన్నారు. అయితే.. నేషనలిస్ట్ మహిళా కాంగ్రెస్, నేషనలిస్ట్ యువ కాంగ్రెస్, నేషనలిస్ట్ విద్యార్థి కాంగ్రెస్‌లను మినహాయించినట్లు చెప్పారు. అయితే.. పార్టీలో ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం వెనక గల కారణాలను వెల్లడించలేదు కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోయిన కొన్ని రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/