తెలంగాణ ముఖ్యాంశాలు

నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ నేడు పర్యటనకు వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరనున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు, మరికొందరు మంత్రులు ఉండనున్నారు. అయితే.. సీఎం కేసీఆర్ రెండు మూడు రోజులు ఢిల్లీలోనే బస చేయనున్నట్లు సమాచారం. సోమవారం సాయంత్రం కేసీఆర్ ఢిల్లీకి పయనం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా.. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీలో పర్యటించిన సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సైతం సమావేశమై.. బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు పలు వ్యూహాలు రచించారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ మళ్లీ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంతో పాలిటిక్స్ మరింత వేడెక్కాయి.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/