ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

సిఎం జగన్‌ కోనసీమ జిల్లా పర్యటన

సిఎం జగన్‌ వరద ముంపుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితులకు అండగా కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. కోనసీమలో భారీ వర్షం కురుస్తున్నా.. సీఎం తన పర్యటన కొనసాగిస్తూ.. బాధితులకు ధైర్యాన్ని ఇస్తున్నారు. పి.గన్నవరం మండలం జి. పెదపూడికి సీఎం జగన్‌ చేరుకున్నారు. అనంతరం ఆ వర్షంలోనే వరద బాధితులకు వద్దకు సీఎం జగన్‌ చేరుకొని.. పరామర్శిస్తున్నారు. ఇందుకోసం సీఎం జగన్ పంటిపై,ట్రాక్టర్ పై పయనిస్తున్నారు. ప్రస్తుతం జగన్ నాగుల్లంక గ్రామంల్లో పర్యటిస్తున్నారు. అనంతరం పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశంకానున్నారు. బాధితులతో సీఎం జగన్‌ నేరుగా మాట్లాడి.. పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. సీఎం జగన్ అరిగెలవారిపేట, ఉడిమూడిలంక, వాడ్రేవు పల్లిలోని వరద ముంపు బాధితులతో సమావేశం కానున్నారు. వరద ముంపు గ్రామాలను పరిశీలించి.. తాజా పరిస్థితులను అంచనా వేయనున్నారు. గత కొన్నేళ్లుగా వరదల సమయంలో వశిష్ట నదిపాయ తెగిపోవడంతో ఇబ్బందుల్లో లంక గ్రామ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. లంకల గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మధ్యాహ్నం రాజోలునియోజకవర్గంలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మేకలపాలెంలో వరద బాధితులతో సమావేశం కానున్నారు. సాయంత్రం సీఎం జగన్ రాజమండ్రి చేరుకొని.. ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు. అక్కడ తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరద సమయంలో తీసుకున్న సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి రాజమండ్రిలోనే సీఎం జగన్ బస చేయనున్నారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/