ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

జూలైలో శ్రీవారి హుండీకి భారీ ఆదాయం

జూలై నెలలో 139.45 కోట్ల ఆదాయం, రికార్డు స్థాయిలో కానుకలు సమర్పించుకున్న భక్తులు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీకి కాసుల వర్షం కురుస్తోంది. తాజాగా జూలై నెలలో శ్రీవారి హుండి ఆదాయం అత్యధికంగా నమోదు అయింది. టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్వామివారికి 139.45 కోట్ల హుండి ఆదాయం వచ్చి చేరింది. దీంతో వరుసగా ఐదో నెల 100 కోట్లు దాటి శ్రీవారి హుండి ఆదాయం నమోదు అయింది.

ఈ ఏడాది మార్చి నెలలో 128 కోట్లు, ఏప్రిల్ మాసంలో 127.5 కోట్లు, మే నెలలో 130.5 కోట్లు, జూన్ లో 123.76 కోట్ల రూపాయలు హుండీ ద్వారా టీటీడీకి ఆదాయం లభించగా, జూలై మాసంలో హుండీ ద్వారా ఏకంగా 139.45 కోట్ల ఆదాయం లభించింది. చివరి నాలుగు మాసాల్లో 649.21 కోట్ల రూపాయలు స్వామి వారికి కానుకలు అందాయి. వరుసగా ఐదో నెల 100 కోట్ల మార్కును శ్రీవారి హుండీ ఆదాయం దాటింది. జూలై నెలలోనే ఐదుసార్లు 5 కోట్ల రూపాయల మార్క్ ని హుండీ ఆదాయం చేరగా, జూలై 4వ తేదీన స్వామి వారికి 6.18 కోట్ల హుండీ ఆదాయం లభించింది. ఒక్క రోజులో ఎక్కువ ఆదాయం నమోదైంది జూలై 4వ తేదీన కావడం విశేషం.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/