ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తుంది. బంజారాహిల్స్ రోడ్ నం 12 లోని వేమూరీ ఎన్ క్లేవ్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని ఆర్మూర్‌కు చెందిన మక్లూర్ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్తగా గుర్తించారు. తన భార్య లావణ్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె భర్త ప్రసాద్ గౌడ్ ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తుంది.
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటి దగ్గర మంగళవారం ఉదయం ప్రసాద్ గౌడ్ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ఎమ్మెల్యే సిబ్బంది చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి కత్తి, పిస్టల్‌ను స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/