తెలంగాణ ముఖ్యాంశాలు

ఆదిలాబాద్‌లో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత

నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
ఆదిలాబాద్‌ పట్టణంలోని తాటిగూడ కాలనీలో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు.
రూ.06 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. తాటిగూడ కాలనీకి చెందిన మహమ్మద్ సమీర్ అనే వ్యక్తి తన ఇంట్లో గుట్కా ప్యాకెట్లను నిల్వ చేసుకొని అక్రమంగా చిరు వ్యాపారులకు సరఫరా చేస్తున్నాడు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టామని టాస్క్‌ఫోర్స్ సీఐ చంద్రమౌళి తెలిపారు.