తెలంగాణ గవర్నర్ తమిళిసై రేపు ఆదివారం బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లనున్నారు. రీసెంట్ గా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులతో ప్రత్యేకంగా రాజ్‌భవన్‌లో భేటీ అయిన గవర్నర్ తమిళిసై, రాష్ట్రంలో 75కాలేజీలను సందర్శించబోతున్నట్లు తెలిపారు. అందులో బాసర త్రిపుల్ ఐటీ కూడా ఉందని విద్యార్ధులతో అన్నారు. కాగా బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించేందుకు ఇవాళ రాత్రి కాచిగూడ రైల్వేస్టేషన్ నుండి బాసరకు గవర్నర్ తమిళిసై వెళ్లనున్నారు.
రైలు మార్గాన వెళ్లనున్న గవర్నర్ తెల్లవారుజామున 2:50గంటలకు బాసర రైల్వే స్టేషన్ కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 4 గంటలకల్లా బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకుంటారు. రేపు ఉదయం 6 గంటలకు సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటారు. 07 గంటలకు స్టూడెంట్స్ తో కలిసి బ్రేక్ పాస్ట్ చేయనున్నారు. 8 నుండి 10 గంటలవరకు స్టూడెంట్స్ సమస్యల గురించి మాట్లాడనున్నారు. ఆ తర్వాత క్యాపస్ ను పరిశీలించనున్నారు. లంచ్ అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రైలు మార్గంలో సాయంత్రం 5.40గంటలకు హైదరాబాద్ రానున్నారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/