బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన గవర్నర్ ఫగ్ చౌహాన్‌కు రాజీనామా లేఖ అందించారు. బిజెపి తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. తనను బలహీనం చేసేందుకు బిజెపి చాలా కుట్రలు చేసిందని ఆరోపించారు. చాలాసార్లు బిజెపి తనను అవమానించిందన్నారు నితీష్. ఆర్జేడీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు నితీష్. తేజస్వియాదవ్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం ఉంది .కాంగ్రెస్‌కు స్పీకర్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. జేడీయూ ఎంపీలు , ఎమ్మెల్యేలతో సమావేశం తరువాత రాజీనామా నిర్ణయం తీసుకున్నారు నితీష్‌కుమార్.
యునైటెడ్ జనతాదళ్‌ను చీల్చేందుకు అమిత్‌షా కుట్ర చేశారన్నది నితీష్ ప్రధాన ఆరోపణ. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే సీన్ రిపీట్ చేసి RCP సింగ్‌ను సీఎం చేయడానికి అమిత్‌షా పధకం రచించారని ఆరోపిస్తున్నారు జేడీయూ నేతలు. నితీశ్‌కుమార్ ముందే మేల్కొని.. బిజెపికి దూరం జరుగుతున్నారని అంటున్నారు. మరోవైపు.. బీహార్ రాజకీయాలపై చర్చించేందుకు ఢిల్లీలో బిజెపి కోర్ కమిటీ భేటీ సమావేశం కాబోతోంది.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/