అంతర్జాతీయం జాతీయం ముఖ్యాంశాలు

భారత్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలుః రష్యా అధ్యక్షుడు పుతిన్

భారత్ సమున్నత స్థాయిలో నిలిచిందని కితాబు

నేడు భారత దేశం 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. భారత్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలు తెలియజేశారు. భారత్-రష్యా మైత్రి ప్రత్యేకమైనదని ఆయన అభివర్ణించారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని అన్నారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలో సమున్నతస్థాయిలో నిలిచిందని కొనియాడారు. ఆర్థిక, సాంకేతిక, సామాజిక రంగాల్లో భారత్ విశేష రీతిలో అభివృద్ధి సాధించిందని తెలిపారు. అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో భారత్ కీలకపాత్ర పోషిస్తోందని కీర్తించారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీలను ఉద్దేశించి ప్రకటన చేశారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/