అంతర్జాతీయం ముఖ్యాంశాలు

మా మిత్ర దేశాలకు అత్యాధునిక ఆయుధాలు అందించేందుకు సిద్ధంః పుతిన్‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ మాస్కో సమీపంలో జరిగిన ‘ఆర్మీ-2022’ కార్యక్రమంలో ప్రసంగించారు. మిత్ర దేశాలతో సంబంధాలకు రష్యా చాలా విలువ ఇస్తుందని, వారికి అత్యాధునిక మిలటరీ ఆయుధాలు అందించేందుకు సిద్ధంగా ఉందని వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ‘‘మా మిత్ర దేశాలకు అత్యాధునిక ఆయుధాలు అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. చిన్న చిన్న ఆయుధాల నుంచి ఆర్మర్డ్ వాహనాలు, వైమానిక దాడులను నిలువరించే ఆర్టిలరీ, మానవ రహిత వైమానిక ఆయుధాలు అన్నీ అందించేందుకు రష్యా రెడీగా ఉంది’’ అని పుతిన్ అన్నారు.

కాగా, పాశ్చాత్య దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధించాయి. ఇలాంటి సమయంలో పుతిన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా చాలా నష్టపోయిందని, ఈ క్రమంలో ఆ దేశం నుంచి ఆయుధాలను భారీ మొత్తంలో కొనుగోలు చేసే భారత్ వంటి దేశాలు వెనకడుగు వేస్తున్నాయని, అందుకే పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారని కొందరు పాశ్చాత్య విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/