నేడు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియో ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. తన ట్విట్టర్‌లో అతను రియాక్ట్ అయ్యారు. సీబీఐని స్వాగతిస్తున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. ఆ దర్యాప్తు సంస్థకు పూర్తిగా సహకరించనున్నట్లు వెల్లడించారు. ఈ విచారణ ద్వారా ఏమీ బయటకురాదు అని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో సుమారు 20 ప్రాంతాల్లో సోదాలను నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో స్కూళ్ల అభివృద్ధి కోసం సిసోడియా ఎంతో చేశారని, ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్‌ను ప్రశంసిస్తూ అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఇవాళ ఫ్రంట్ పేజీలో కథనం ప్రచురితమైందని, అయితే ఆ రోజునే కేంద్ర ప్రభుత్వం సిసోడియాపై తనిఖీలు చేపట్టడం శోచనీయమన్నారు. గతంలో తమపై ఎన్నోసార్లు సోదాలు జరిగాయని కేజ్రీ అన్నారు.
కాగా, ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల కొత్త ఎక్సైజ్ పాలసీని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ విధానం అమలులో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియో ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/