తెలంగాణ ముఖ్యాంశాలు

తీన్మార్ స్టెప్స్ తో రచ్చ చేసిన మంత్రి మల్లారెడ్డి

మంత్రి మల్లారెడ్డి ..ఈ పేరు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. వివాదాలకైనా..సంచలన ప్రకటనలకైనా మంత్రి మల్లారెడ్డి ముందుంటారు. తాజాగా మరోసారి అలాగే వార్తల్లో నిలిచారు. ఈరోజు మునుగోడు లో టిఆర్ఎస్ పార్టీ ప్రజాదీవెన సభ ఏర్పటు చేసింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు టిఆర్ఎస్ నేతలంతా ఈ సభ కు హాజరయ్యారు. హైదరాబాద్ నుండే కాక ఇతర జిల్లాల నుండి కూడా భారీ సంఖ్య లో వాహనాలతో మనుగోడుకు బయలుదేరారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి సైతం భారీ సంఖ్యలో వాహనాలతో వెళ్లారు. ఈ క్రమంలో తనదైన స్టయిల్ లో తీన్మార్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు.

తన క్యాంపు కార్యాలయం నుంచి ఉప్పల్ వరకు పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చారు. టీఆర్ఎస్ జెండాలు పట్టుకుని జై తెలంగాణ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. ఓ ఏరియాకు వచ్చే సరికి మంత్రి మల్లారెడ్డి కారు రూఫ్ టాప్ నుంచి బయటకు వచ్చి డాన్సులు చేశారు. ‘చుట్టు చుట్టు చుట్టు చుక్కలు చూడు’ ఓ సాంగ్ కు డ్యాన్స్ చేశారు. కార్యకర్తలు కారు ముందు భాగాన నిలిచి.. స్టెప్పులు వేశారు. ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/