ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం వేల్పులలో సచివాలయ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. కడప లో మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన కొనసాగబోతుంది. సాయంత్రం కడప కు చేరుకున్న జగన్..వేముల మండలంలోని వేల్పుల గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. కాసేపట్లో ఇడుపుల పాయ గెస్ట్ హౌస్ కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. రెండో రోజు పర్యటనలో భాగంగా 2వ తేదీ ఉదయం 8.50 గంటలకు ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ గెస్ట్ హౌస్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 9గంటలకు వైఎస్సార్ ఘాట్ కు చేరుకుంటారు. 9.40 గంటల వరకు వైఎస్సార్ ఘాట్ దగ్గర నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొంటారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇడుపులపాయలో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులతో సీఎం జగన్ సమీక్షిస్తారు. సాయంత్రం 5.10 గంటలకు గెస్ట్ హౌస్ కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు.
ఇక మూడో రోజు.. అంటే 3వ తేదీ ఉదయం 8.50 గంటలకు ఇడుపుల పాయ ఎస్టేట్ లోని గెస్ట్ హౌస్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి అక్కడే ఉన్న హెలిప్యాడ్ వద్దకు 9 గంటలకు సీఎం వై.ఎస్. జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 9.15 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 9.20 గంటలకు ప్రత్యేక విమానంలో కడప నుంచి బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకొని తన నివాసానికి బయలుదేరి వెళ్తారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/