ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

చంద్రబాబు కు మంత్రి జోగి రమేష్‌ సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబు కు మంత్రి జోగి రమేష్‌ సవాల్ విసిరారు. రెండు లక్షల కోట్లు అవినీతికి పాల్పడినట్టు చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని.. వీటిపై చర్చకు రావాలని మంత్రి సవాల్‌ విసిరారు. ఎక్కడకు రావాలో చెప్తే అక్కడకే తామే వస్తామని స్పష్టం చేశారు. డీబీటి ద్వారా తాము లక్షా 70 వేల కోట్లు నేరుగా ప్రజలకు అందించామని పేర్కొన్నారు. అవినీతి కేసులు విచారణ జరగనీయకుండా స్టే తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు.. దమ్ముంటే వాటిపై విచారణ జరిపించుకోవాలన్నారు.

కుప్పం ప్రజల తిరుగుబాటుకు భయపడి పారిపోయిన వ్యక్తి చంద్రబాబు.. కార్యకర్తలను మాత్రం బలి చేయాలని చూస్తున్నాడని జోగి రమేష్‌ ఆరోపించారు.సెప్టెంబర్‌ ఒకటో తేదీ అంటే అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవంగా అందరూ గుర్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని జాకీలు పెట్టి లేపినా చంద్రబాబు, ఆయన కుమారుడు ఇక లేవలేరు, సొంత పార్టీ నేతలే చంద్రబాబుని నమ్మటం లేదు. అందుకే గొడవలు చేయమని కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. పరిశ్రమలు రాకుండా అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. పులివెందులని టచ్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా? కుప్పంలోనే కుదేలైన ఆయన ఇక పులివెందులలో ఏం చేస్తాడు? అని రమేష్ ప్రశ్నించారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/