దేశంలో కరోనా కేసులు రోజువారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 6,395 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 6,614 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి కారణంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,44,78,636కు చేరాయి. ఇందులో 4,39,00,204 మంది కోలుకున్నారు.
మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 5,28,090 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 50,342 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రివకరీ రేటు 98.7శాతం ఉండగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 1.88శాతం ఉందని తెలిపింది. ఇప్పటి వరకు 88.83కోట్ల కొవిడ్ టెస్టులు నిర్వహించగా.. వాక్సినేషన్ డ్రైవ్‌లో 214.27కోట్ల డోసులు వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/