సుప్రీంకోర్టు ఎట్టకేలకు కేరళ జర్నలిస్టు సిద్దిక్ కప్పన్‌కు బెయిల్ మంజూరీ చేసింది. ప్రతి ఒక వ్యక్తి భావ స్వేచ్ఛ ఉన్నట్లు కోర్టు తెలిపింది. 2020 నుంచి కప్పన్ జైలులో ఉన్నాడు. హత్రాస్‌లో జరిగిన 19 ఏళ్ల అమ్మాయి రేప్ ఘటన గురించి రిపోర్టింగ్ చేసేందుకు వెళ్లిన కప్పన్‌ను యూపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. యూఏపీఏ చట్టం కింద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రాబోయే ఆరు వారాల పాటు జర్నలిస్టు కప్పన్ ఢిల్లీ పోలీసులకు రిపోర్ట్ చేస్తారని చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ తెలిపారు. ఆ తర్వాత అతను కేరళలో రిపోర్ట్ చేయనున్నారు. మలయాళం న్యూస్ పోర్టల్ అజిముకుం రిపోర్టర్‌గా చేస్తున్న కప్పన్‌కు గతంలో కోర్టు బెయిల్ ఇవ్వలేదు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో కప్పన్‌కు లింకు ఉన్నట్లు యూపీ పోలీసులు ఆరోపించారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/