జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై వైస్సార్సీపీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్ కళ్యాణ్ ఈరోజు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని , అసలు పవన్ కళ్యాణ్ కు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. 175 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులే జనసేన కు లేరు కానీ.. అసెంబ్లీ జెండా ఎగురవేస్తారట అంటూ ఎద్దేవా చేశారు. ముందు సర్పంచ్‌లుగా గెలవండి.. తర్వాత ఎమ్మెల్యేల గురించి ఆలోచించండి అంటూ పరువు తీసింది.
అక్కడి తో ఆగకుండా ఎన్టీఆర్, చిరంజీవి పార్టీ పెట్టి సింగిల్‌గా పోటీచేస్తే.. పవన్ మాత్రం 2014లో ప్యాకేజీకి ఆశపడ్డారని విమర్శించారు. ప్యాకేజీల కోసమే పవన్ విమర్శలు చేస్తున్నారని.. పవన్ పార్టీ పెట్టింది చంద్రబాబు కోసమే అంటూ ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే పవన్.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి కరకట్టలో దాక్కున్న చంద్రబాబును ఎందుకు నిలదీయలేదన్నారు. విభజన చట్టంలో ఏపీ ఆస్తులపై పవన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/