టీడీపీ నేత పట్టాభి..ఏపీ సీఎం జగన్ కుప్పం పర్యటన ఫై ఘాటుగా స్పందించారు. గతంలో బందిపోట్లు, దొంగలను చూసి జనాలు భయపడేవారని… ఇప్పుడు జగన్ పర్యటన అంటేనే భయపడుతున్నారని పట్టాభి అన్నారు. జగన్ పర్యటన అంటేనే అన్నింటినీ బలవంతంగా మూసేస్తున్నారని… చివరకు మెడికల్ షాపులను కూడా మూసివేయడం దారుణమని పట్టాభి అన్నారు.
జగన్ మీటింగ్ లకు జనాలను బలవంతంగా తరలిస్తున్నారని… కార్యక్రమానికి రాకపోతే పథకాలను ఆపేస్తామని బెదిరిస్తున్నారని విమర్శించారు. జగన్ వైజాగ్ పర్యటన సందర్భంగా పాఠశాలలకు సెలవు ఇవ్వాలని అధికారులే ప్రకటించడం అధికార దుర్వినియోగం కాదా? అని ప్రశ్నించారు. సభ నుంచి ప్రజలు బయటకు వెళ్లిపోకుండా గేట్లకు తాళాలు వేస్తున్నారని పట్టాభి అన్నారు. జగన్ కుప్పం పర్యటనకు వివిధ ప్రాంతాల నుంచి జనాలను తరలించారని చెప్పారు. బీసీల మీద ఎంతో ప్రేమ ఉందని చెప్పుకునే జగన్… చిత్తూరు జిల్లాలో బీసీలకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/