ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

తిరుమల లో భక్తుల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న టిటిడి

Getting your Trinity Audio player ready...

బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీవారి బ్రేక్ దర్శనాల వేళల్లో మార్పు

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ధర్మకర్తల మండలి నేడు సమావేశమైంది. తిరుమలలో భక్తు రద్దీ నియంత్రణకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇవాళ టిటిడి పాలక మండలి చైర్మన్‌ వైవీ సుబ్బా రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని నిర్ణయించారు.

బ్రహ్మోత్సవాల బ్రేక్‌ దర్శనాల సమయంలో మార్పు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్రేక్‌ దర్శనాలు ప్రయోగా త్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు చైర్మన్‌ సుబ్బారెడ్డి వెల్లడించారు. బ్రహ్మోత్స వాల అనంతరం టైమ్‌స్లాట్‌ టోకెన్లు, సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని వివరించారు. ప్రాథమికంగా రోజుకు 20వేల చొప్పున సర్వదర్శ నం టోకెన్లు జారీజేస్తామని పేర్కొన్నారు.

రూ. 95 కోట్లతో యాత్రికుల వసతి సముదాయాల నిర్మాణం , రూ. 30కోట్లతో చెర్లోపల్లి నుంచి వకుళామాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణం చేపడుతామని తెలిపారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి సేంద్రీయ వ్యవసా యం ద్వారా పండించిన వాటినే వినియోగించాలని నిర్ణయించామని అన్నారు. రూ. 2.45 కోట్లతో నందకం అతిథి గృహంలో ఫర్నిచర్‌,రూ. 3కోట్లతో నెల్లూరులో కల్యాణ మండపాల దగ్గర ఆలయం నిర్మాణం ఏర్పాటు చేస్తామన్నారు. టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని అన్నారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/