Getting your Trinity Audio player ready...
|
నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో రూ.1,790 కోట్లతో నెలకొల్పిన రామ్‌కో కంపెనీ సిమెంట్ పరిశ్రమను బుధువారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ… రూ.2,500 కోట్ల పెట్టుబడితో వెయ్యి మందికి పరిశ్రమలో ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు రాంకో సిమెంట్స్ ఉదాహరణగా చెప్పుకొచ్చారు. రైతులకు ఎకరాకు రూ.30 వేలు లీజు ఇచ్చి సోలార్, విండ్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరుసగా 3 ఏళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ నిలిచామన్నారు. పారిశ్రామిక వేత్తలకు ఏపీ ప్రభుత్వం అండగా ఉందని భరోసా ఇచ్చారు.
అలాగే మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్నిపారిశ్రామికంగా ప్రగతిపథంలో తీసుకెళ్లేందుకు సీఎం వైయస్ జగన్ పడుతున్న తపన, తాపత్రయం గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలు, వారి సంస్థలకు ఈ ప్రభుత్వం ఏరకంగా ప్రోత్సహకాలు, సహకారం అందిస్తుందో నిలువెత్తు నిదర్శనం మొన్న జరిగిన ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకే ఉదాహరణగా చెప్పవచ్చు. ఏపీ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటిస్‌గా చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రానికి ఉన్న సముద్రతీరం ఒక అడ్వాంటేజ్‌గా చెప్పుకోవచ్చు. నేషనల్ హౌవే కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, ఇన్‌ఫ్రాక్చర్ డెవలప్‌మెంట్ ఇవన్నీ కూడా పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతాయి. ఈ రాష్ట్రానికి ఒక గొప్ప ముఖ్యమంత్రి ఉండటం మనం చేసుకున్న అదృష్టం అన్నారు.
రెండు రోజుల తిరుమల పర్యటన పూర్తి చేసుకొని నంద్యాల జిల్లా కొలిమిగుండ్లకు సీఎం చేరుకున్నారు. ఓర్వకల్లులోని ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వైయస్ఆర్ సీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. కొలిమిగుండ్లకు చేరుకున్న సీఎం వైయస్ జగన్ రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/