ఆంధ్రప్రదేశ్ రాజకీయం

బాబును సీఎం చేసేందుకే పవన్ పనిచేస్తున్నాడు.. ముందస్తుపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి..

MP Mithun Reddy: క్యాబినెట్ విస్తరణ ఉండదన్నారు..ఇదంతా ఊహాగానాలు.. డైరెక్ట్ ఎన్నకలే అని తేల్చి చెప్పారు. అమలాపురంలో మళ్ళీ విశ్వరూప్ పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చారు. వారసత్వలకు ఇంకా సమయం ఉందన్నారు. ఒక ఫ్యామిలీలో

ముందస్తు ఎన్నికలు ఉండవని ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ముందస్తు ఉంటుందని టీడీపీ, జనసేన పార్టీలో ఊహాగానాలు సృష్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. మీడియాతో ఎంపి మిథున్ రెడ్డి మీడియాతో ముచ్చటిస్తూ ఈ వివరాలను వెల్లడించారు. క్యాబినెట్ విస్తరణ ఉండదన్నారు..ఇదంతా ఊహాగానాలు.. డైరెక్ట్ ఎన్నకలే అని తేల్చి చెప్పారు. అమలాపురంలో మళ్ళీ విశ్వరూప్ పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చారు. వారసత్వలకు ఇంకా సమయం ఉందన్నారు. ఒక ఫ్యామిలీలో ఒకరికి అవకాశం ఇవ్వాలని పార్టీ ముందుకు పోతుందన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో పవన్ కల్యాణ్ పని చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబుని సీఎం చేయాలనే టార్గెట్‌తో జనసేన పావులు కదుపుతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన 34 సీట్లలో పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోందని.. అసలు ఆ సీట్లలో ఎన్నింటిలో పోటీ చేస్తుందో కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేదని అన్నారు.

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 రాష్ట్రాల్లో ఏపీ చేరిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం వైసీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో వైసీపీ కలుస్తుందంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అవి కేవలం ఊహాజనితం మాత్రమేనని అన్నారు.