ఉత్తరాన స్థిరపడ్డారు. పశ్చిమాన్ని పక్కా చేసుకున్నారు. ఈశాన్యాన్ని దక్కించుకున్నారు. ఇక మిగిలింది దక్షిణాది ఒక్కటే. యావత్ భారతం కాషాయ పార్టీ వ్యూహాలకు చిక్కితే.. దక్షిణాది మాత్రం అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. దీంతో మరో యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. కాషాయ సిద్ధాంతానికి లోకల్ ఫ్లేవర్ యాడ్ చేసి దక్షిణాది రాష్ట్రాలపై పట్టు పెంచుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం తెలంగాణను అడ్డగా చేసుకొని స్ట్రాటజీలపై చర్చించారు బీజేపీ పెద్దలు.
భారతీయ జనతా పార్టీ ఎన్నడూ గెలవని 164 స్థానాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. కర్నాటక ఓటర్ల వార్నింగ్‌తో అప్రమత్తమైన బీజేపీ దక్షణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పార్టీలో ఉన్న లుకలుకలను సెట్ రైట్ చేస్తూ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా సామవేశం అయ్యారు. నోవాటెల్ హోటల్‌లో దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. లీకులతో పార్టీకి నష్టం జరిగింది.. ఇకపై అలా చేయవద్దని జేపీ నడ్డా సున్నితంగా హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీరియస్‌గానే హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లోల సౌత్ జోన్‌లో 170 ఎంపీ సీట్ల టార్గెట్ పెట్టుకున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్థానికంగా బలోపేతం కావడం..క్షేత్రస్థాయిలో ఐక్యత చూపించాలని నడ్డా అన్నట్లుగా తెలుస్తోంది.అయితే, ఇప్పటికే 2024 లోక్‌సభ ఎన్నికలకు కమలనాథుల రోడ్ మ్యాప్ రెడీ చేశారు.
రాష్ట్ర కెడర్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం.. నేతలు ఓపెన్ మాట్లాడుతుండటంతో ఈ భేటీలో జెపీ నడ్డా హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై సోషల్ మీడియా వేదికల్లో, మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌లలో ఆచితూచీ మాట్లాడాలని.. మాట్లాడుతున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాని సూచించినట్లుగా తెలుస్తోంది.
గత కొంతకాలం పార్టీ వ్యవహారాలను బయటకు లీకులు అందించే పనులు చేయవద్దని.. ఇలాంటివాటితో పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని జేపీ నడ్డా నేతలను హెచ్చరించారు.పార్టీ లైన దాటి మాట్లాడితే.. కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు జేపీ నడ్డా. ఇక హైదరాబాద్‌లో పార్టీ సమావేశానికి వచ్చిన నడ్డా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. తల్లి ఆశీర్వాదం కోరారు.