karate
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో గాయత్రి విద్యానికేతన్ విద్యార్థుల పతకాల పంట

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు పతకాల పంట పండించారు. ఈ నెల 15, 16 వ తేదీల్లో  హైదరాబాద్ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించిన నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ లో  పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ కి చెందిన విద్యార్థులు అండర్-14 విభాగంలో పోటీ పడి పలు పతకాలు సాధించారు. పానుగంటి అశ్విత్ (గోల్డ్ మెడల్), కొయ్యడ గౌతమ్ (సిల్వర్ మెడల్), అమృతేశ్వర్, ఎ. నవదీప్, ఎం. మన్విత్ రెడ్డి లు కాంస్య పతకాలు సాధించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఆధునిక సమాజంలో ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాల్సి న అవసరం ఉన్నదని, అందుకే మా పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు కరాటే శిక్షణ ఇప్పిస్తున్న ట్లు చెప్పారు. అనంతరం పతకాలు సాధించి పాఠశాలకు వన్నె తెచ్చిన విద్యార్థులను, కరాటే మాస్టర్ మల్యాల రామస్వామి లను అభినందిం చారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, రజియుద్దీన్, పిఇటి నవీన్ తదితరులు పాల్గొన్నారు.