ఖమ్మం జిల్లా రఘునాథపాలెం లోని ఓ మద్యం దుకాణం వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం మత్తులో కొంత మంది యువకులు తమకు దొరికిన సామగ్రితో, కర్రలతో దాడులు చేసుకున్నారు. సీసాలు పగలగొట్టి మరి దాడి అక్కడున్న వారిపై కూడా దాడి చేశారు. దీంతో మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన వారు కొందరు భయంతో పరుగులు తీశారు. ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రధాన రహదారి మీదకు వచ్చి వాహనాలను ఆపి యువకులు ఘర్షణ పడ్డారు.
పెద్దతండాకు చెందిన తేజావత్ రమేష్ తల పగిలి గాయాలయ్యాయి. ఆయన ఫిర్యాదు మేరకు గోపాలపురానికి చెందిన బాదావత్ ప్రవీణ్, దుగ్గి వేణు, వలపులేని విజయ్ కుమార్, లింగాల నవీన్ కు మార్, విజయ్ పై రఘునాథ పాలెం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దాడిలో పాల్గొన్న యువకుల్లో కొందరు గోపాలపురంలో జరిగిన దాడి ఘటనలో ఉన్నారని తెలుస్తోంది.