cherlopalli
ఆంధ్రప్రదేశ్

కోత మిషన్ లో అగ్ని ప్రమాదం

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చెర్లోపల్లి సమీపంలోని అమరావతి జాతీయ రహదారి పక్కన కోత మిషన్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన నిన్న జరిగింది సంఘటనలో రెండు లక్షల రూపాయలకు పైగా విలువచేసే కలప కాలిపోయింది. గుర్తుతెలియని వ్యక్తులు కలపకు నిప్పంటించడంతో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు కోత మిషన్ నిర్వాహకుడు తెలిపాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసినందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే చాలా మేరకు కలప కాలిపోయింది.