jagan
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

జగనన్న సురక్షా రికార్డులు

జగనన్న సురక్ష’ కార్యక్రమం రాష్ట్రంలో రికార్డు సృష్టిస్తోంది. అర్హత ఉండి కూడా రాష్ట్రంలో ఎవరూ ప్రభుత్వ పథకాలు అందకుండా ఉండకూడదన్న మహోన్నత లక్ష్యంతో ప్రభుత్వం ‘జగనన్న సురక్షా’ కార్యక్రమాన్ని జులై 1న లాంఛనంగా ప్రారంభించింది. అంతేకాకుండా వివిధ పాఠశాలు, కాలేజీల ప్రారంభం, అడ్మిషన్ల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యార్థులు ఎవరూ ఇబ్బందులు పడకూడదని సురక్షా శిబిరాల్లోనే వివిధ ధృవీకరణ పత్రాలను కూడా మంజూరు చేయిస్తోంది. వివిధ శాఖలు జారీ చేసే 11 రకాల ధృవీకరణ పత్రాలను ఎటువంటి యూజర్ ఛార్జీలు లేకుండా అక్కడికక్కడే ప్రజలకు అందజేస్తోంది. అయితే ఈ కార్యక్రమం ప్రారంభమైన మొదటి రోజు నుంచే ప్రజల దగ్గర నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది.

మొదటిరోజు మొత్తం 1305 సచివాలయాల పరిధిలో 4,73,441 వినతులు వస్తే వాటిల్లో ప్రభుత్వం అక్కడిక్కడే పరిష్కరించినవి 4,57,642 ఉన్నాయి. 17వ తేదీ నాటికి మొత్తం 9,721 సచివాలయాల పరిధిలో ఉన్న 84.11 లక్షల కుటుంబాల నుంచి 53.24 లక్షల వినతులు వస్తే 51.14 లక్షల వినతులు అక్కడికక్కడే పరిష్కారమయ్యాయి. 11వ తేదీ ఒకరోజే 6.5లక్షలకు పైగా వినతులు పరిష్కారం కావడం విశేషం.ఇప్పటిదాక మొత్తం 1.69,891 మంది వాలంటీర్లు జగనన్న సురక్షా శిబిరాల కోసం తమ క్లస్టర్లలోని 84.11 లక్షల ఇళ్లలో సర్వే నిర్వహించారు. అత్యధికంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి 4,56,147 అభ్యర్థనలు రాగా.. అధికారులు 4,37,509 పరిష్కరించారు.

అలాగే అత్యల్పంగా పార్వతీపురం జిల్లా నుంచి 89,303 అభ్యర్థనలు రాగా పరిష్కారమైనవి 62,312. అంతేకాదు అధికారులు ఇప్పటిదాకా 25,39,136 ఇంటిగ్రేటెడ్ సరిఫికెట్లు, 23,25,388 ఆదాయ ధృవీకరణ పత్రాలు, 4,154 ఓబీసి సర్టిఫికెట్లు, 2,764 మ్యారేజ్ సర్టిఫికెట్లు, 9,968 ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, 45,930 అడంగల్ సర్టిఫికెట్లు, 1, 08,005 వన్ బీ సర్టిఫికెట్లు జారీ చేశారు. ఇక ఆరోగ్య శ్రీ కార్డులు 3,224, కొత్త బియ్యం కార్డులు 9,378, బియ్యం కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించిన సేవలు 8, 263, ఆధార్ తో మొబైల్ అనుసంధానం చేసిన సేవలు 1,78,499 ఉన్నాయి.

అలాగే పట్టాదారు పాసు పుస్తకాల సేవలు 2,841 ఉన్నాయి.ప్రజలు రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి పనులు కాక ఇబ్బందులు పడే రోజులు పోయాయని జగనన్న ప్రభుత్వంలో అధికారులతో ఏ పనీ ఉన్నా సులభంగా పూర్తవుతున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇంకా ఎవరైనా అర్హత ఉండి కూడా పథకాలు అందకపోతే వెంటనే స్థానికంగా ఉన్న వాలంటీరును కానీ గ్రామ, వార్డు సచివాలయాల అధికారులను కానీ సందర్శించాలని అధికారులు కోరుతున్నారు.