హైదరాబాద్ : వర్షాకాల ప్రణాళికల మేరకు పూర్తి సంసిద్ధతతో పనిచేయాలని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీపై మంత్రి కేటీఆర్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ కంపతీ విశ్వజిత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా నగరంలో తక్కువ సమయంలోనే కుండపోత వర్షాలు కురుస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో వర్షాకాల ప్రణాళికల మేరకు పూర్తి సంసిద్ధతతో పనిచేయాలన్నారు. విభాగాలు సమన్వయంతో ముందుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
నాలాలపై క్యాపింగ్, ఫెన్సింగ్ కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. నాలాల అభివృద్ధికి ఎస్ఎన్‌డీపీని మరింత బలోపేతం చేస్తామన్నారు. నాలాలకు సంబంధించిన కార్యక్రమాలను మేయర్, కమిషనర్ పర్యవేక్షించాలని సూచించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం రోడ్లపై తవ్వకాలు చేపడుతున్న నేపథ్యంలో అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు గుత్తేదార్లు, శాఖలకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయాలన్నారు. సీజనల్ వ్యాధుల కట్టడికి పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. దోమల నివారణకు ఫాగింగ్, యాంటీ లార్వా కార్యక్రమాలు మరింత పెంచాలని కేటీఆర్