ramachandra
తెలంగాణ రాజకీయం

బీజేపీ నేత రామచంద్ర రావు హౌస్ అరెస్ట్

మాజీ ఎమ్మెల్సీ రాంచందరావును తార్నాకలోని అయన నివాసంలో ఓయూ పోలీసులు హౌస్ అరెస్టు చేసారు. రామచంద్ర రావు మాట్లాడుతూ కొన్ని లక్షల మంది డబుల్ బెడ్ రూమ్ ల కోసం ఎదురుచూస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు ఆగిపోయాయో చూడడానికే మేము వెళ్తున్నాం. చూడడానికి వెళ్లకూడదా. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని అన్నారు.

బాటసింగారం డబుల్ బెడ్ రూమ్ పర్యవేక్షణకు కిషన్ రెడ్డి పిలుపుమేరకు బీజేపీ నాయకులు అందరిని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారని అయన ధ్వజమెత్తారు. నగరం తో పాటు జిల్లాల నుండి వస్తున్న వారిని కూడా బిజెపి నాయకుల హౌస్ అరెస్టుల తోపాటు ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వం గత తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాలుగా డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తానని ప్రజలను మభ్యపెడుతుందని అన్నారు.