భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 30న పీఎస్‌ఎల్‌వీ సీ56 ప్రయోగం చేపట్టనుంది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి 30న ఉదయం 6.30 గంటలకు సింగపూర్‌కి చెందిన డీఎస్-ఎస్‌ఏఆర్ ఉపగ్రహంతోపాటు మరో ఆరు శాటిలైట్లను నింగిలోకి పంపనున్నట్టు ఇస్రో సోమవారం వెల్లడించింది. సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలకు ఉపగ్రహ ఛాయాచిత్రాల అవసరాల నిమిత్తం డీఎస్-ఎస్‌ఏఆర్‌ను ప్రయోగిస్తున్నారు.డీఎస్ ఎస్‌ఏఆర్‌తోపాటు టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ మైక్రో శాటిలైట్ వెలాక్స్-ఏఎం, ఎక్స్‌పరిమెంటల్ శాటిలైట్ ‘ఆర్కేడ్’, 3యూ నానోశాటిలైట్ ‘స్కూబ్-2’, ఐవోటీ కనెక్టివిటీ నానోశాటిలైట్ ‘నూలయన్’, గలాసియా-2, ఓఆర్‌బీ-12 స్ట్రైడర్ శాటిలైట్లను కూడా రోదసిలోకి పంపనున్నారు. చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో ఇటీవలే చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే.
Related Articles
ఇండియా కూటమి కన్వీనర్ గా ఖర్గే
ఇండియా కూటమిని ముందుకు నడిపించేదెవరన్న అంశంపై ఇన్నాళ్ల సస్ప…
అందుబాటులోకి రాజమార్గ్ యాత్ర… యాప్
సాధారణంగా మనం ఏదైనా తెలియని ప్రాంతానికి వెళ్లేటప్పుడు…
పదవీ విరమణ చేసిన మన్మోహన్
ఆర్థిక వ్యవస్థలో అనేక సాహసోపేతమైన సంస్కరణలకు మన్మోహ…