cheques
తెలంగాణ రాజకీయం

పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి

దమ్మాయిగూడ పురపాలక సంఘం పరిదిలోని అహ్మద్ గూడ నాలుగో వార్డుకు చెందిన కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు లబ్ది ధారులకు సోమవారం కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, చైర్ పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ మంగళపురి వెంకటేష్ చేతుల కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిని చేయడం జరిగింది. ఇ సందర్బంగా కౌన్సిలర్ మాట్లాడుతు పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరమని అన్నారు. సోమవారం సాయి బవానీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి చెక్కులు 6 మంది లబ్దిదారులకు అందజేయడం జరిగింది. ఇ కార్యక్రమములో దమ్మాయిగూడ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అద్యక్షులు కౌకుట్ల తిరుపతి రెడ్డి, యూత్ అద్యక్షులు కౌకుట్ల మల్లారెడ్డి, నాలుగో వార్డు అధ్యక్షులు ఎస్.కె బాకర్, ప్రదాన కార్యదర్శి ధనలకోట శ్రవణ్ కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు