ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

సినీ నటుడు కత్తి మహేశ్‌కు స్వల్ప గాయాలు

లారీని ఢీ కొన్న కారు

సినీ నటుడు కత్తి మహేశ్‌కు రోడ్డు ప్ర‌మాదంలో స్వ‌ల్ప‌ గాయాల‌య్యాయి. ఇన్నోవా కారులో నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై ఆయ‌న‌ ప్రయాణిస్తున్న స‌మ‌యంలో అది ఓ లారీని ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న కత్తి మహేష్‌ స్వల్పంగా గాయపడ్డారు. ఆయన నెల్లూరులోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.