jaya
తెలంగాణ రాజకీయం

తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలోచేరిన సినీ నటి జయసుధ

 తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్  సమక్షంలో సినీ నటి జయసుధ బీజేపీలో చేశారు. జయసుధకు పార్టీ కండువ కప్పి సభ్యత్వ రశీదును తరుణ్ చుగ్ అందిచారు. పార్టీ చేరిక కార్యక్రమంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. అంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సినీ నటి జయసుధ సమావేశమయ్యారు. పార్టీలో చేరే అంశంతోపాటు పలు కీలక అంశాలపై చర్చించారు. అన్ని వర్గాలకు బీజేపీ అండగా ఉంటుందని జయసుధకు అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది.