trans genders
తెలంగాణ

డేటింగ్​ యాప్​లో టచ్​, అర్ధరాత్రి ఆపని.. దోపిడీ చేస్తున్న ట్రాన్స్​జెండర్స్​ గ్యాంగ్​!

ట్రాన్స్​జెండర్ల పేరుతో ఓ ముఠా హైదరాబాద్​లో దోపిడీలకు పాల్పడుతోంది. డేటింగ్​ యాప్​లో తమకు టచ్​లో ఉన్న వారిని ఫిజికల్​గా కలుసుకునేందుకు రప్పించి నిలువుదోపిడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. గురువారం రాత్రి హైదరాబాద్​లోని బంజారాహిల్స్​ ప్రాంతంలో ఇట్లాంటి ఘటనే చోటుచేసుకుంది.

డేటింగ్ యాప్ ద్వారా టచ్‌లో ఉన్న ట్రాన్స్‌జెండర్ల ముఠా ఇద్దరు వ్యక్తులను దోచుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బంజారాహిల్స్ ప్రాంతంలోని ఓ ముఠా వారిని కలవడానికి బాధితులను ఎరగా వాడుకున్నట్టు  పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఇద్దరు బాధితులు ప్రముఖ డేటింగ్ అప్లికేషన్ ద్వారా ఈ గ్యాంగ్​ సభ్యులతో సన్నిహితంగా ఉన్నారు.

కాగా, బాధితులిద్దరినీ బంజారాహిల్స్‌లోని భోలానగర్ ప్రాంతానికి రావాలని ట్రాన్స్​జెండర్ల ముఠా కోరినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి వెళ్లిన వారిని దుస్తులను తీసివేయాలని చెప్పి, ఆకర్షించి వారి వీడియోలను తీసినట్టు సమాచారం. ఇక.. ఆ వీడియోలను బహిరంగ పరుస్తామని బెదిరించి, వారి దగ్గరున్న వస్తువులను బలవంతంగా ఎత్తుకెళ్లారని బంజారాహిల్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. నరేందర్ చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే తరహాలో ముఠా చాలా మందిని దోపిడీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.