tamilisai
తెలంగాణ రాజకీయం

ఐదు అంశాల పై వివరణ కోరిన గవర్నర్

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం లో విలీనానికి సంబంధించిన  బిల్లు జాప్యంపై రాజ్ భవన్ వివరణ ఇచ్చింది. కొన్ని అంశాలపై వివరణ గవర్నర్ తమిళిసై కోరారు.  1958 నుండి ఆర్టీసీ లో కేంద్ర గ్రాంట్ లు, వాటా లు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లు లో ఎలాంటి వివరాలు లేవు. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ IX ప్రకారం ఆర్టీసీ స్థితి ని మార్చడం పై సమగ్ర వివరాలు బిల్లు లో లేవు.  ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల తో సమానం గా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం…వారి సమస్యల కు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా, వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడ తాయి అని గవర్నర్ వివరణ కోరారు.  

విలీనం డ్రాఫ్ట్ బిల్లు లో ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగుల తో సమానం గా పెన్షన్ ఇస్తారా, వారి కి ప్రభుత్వ ఉద్యోగుల తో సమానం గా అన్ని ప్రయోజనాలు ఇవ్వడాని కి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.  ప్రభుత్వ ఉద్యోగుల లో కండక్టర్, కంట్రోలర్ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగుల కు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని  గవర్నర్ కోరారు.