dammaiguda
తెలంగాణ రాజకీయం

దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో 14 వ వార్డు లోని యం ఎల్ ఆర్ కాలనీ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు

దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో 14 వ వార్డు లోని యం ఎల్ ఆర్ కాలనీ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. మొత్తం 421 ఓట్లలో 323 ఓట్లు పోల్ కాగా , కార్ గుర్తు తో పోటీ చేసిన ప్యానెల్ కి 183 ఓట్లు మరియూ అద్దం గుర్తు ప్యానెల్ కి 140 ఓట్లు వచ్చాయి. 43 ఓట్ల ఆధిక్యం తో కారు గుర్తు ప్యానెల్ విజయం సాధించింది. కొత్త అధ్యక్షుడిగా చంద్రయ్య గౌడ్, జనరల్ సెక్రటరీ గా కృష్ణ, కోశాధికారి గా చారి, ఉపాధ్యక్షుడు గా అజీమ్ గెలుపొందారు. ఈ సదర్భంగా వీరు మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ గారి నీ మర్యాద పూర్వకంగా కలిశారు. చైర్మన్ గారు వారిని అభినందించి కాలనీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.