కొవిడ్ కొత్త వేరియంట్.. పేరు ఎరిస్. కోవిడ్ థర్డ్‌వేవ్‌లో ప్రపంచాన్ని భయపెట్టిన ఒమిక్రాన్‌కి ఇది సబ్‌వేరియంట్. బ్రిటన్‌లో పుట్టి.. ఆ దేశాన్ని తీవ్రంగా వణికిస్తోంది. జూలై 3న ఎరిస్ వేరియంట్ మొదటి కేసును గుర్తించామని, బ్రిటన్‌లో ఇది వేగంగా వ్యాపిస్తోందని, కేసుల సంఖ్య పెరుగుతోందని ప్రకటించింది యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ. బ్రిటన్‌లో గత వారం రోజుల్లోనే 8 వేలమంది ఆస్పత్రుల్లో చేరారని, వీరిలో 398 కొత్త వేరియంట్ ఇన్ఫెక్షన్స్ గుర్తించామని చెబుతోంది డబ్ల్యు.హెచ్.ఓ. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఏసియాలో కోవిడ్ కేసులు పెరగడంతో స్క్రీనింగ్ మీద దృష్టి పెట్టింది యూకే. ఇందులో భాగంగానే ఈ కొత్త వేరియంట్ బైటపడింది. నమోదౌతున్న ప్రతీ ఏడు కోవిడ్ కేసుల్లో ఒకటి ఎరిస్ వేరియంటేనని, ఇది ఆషామాషీ వేరియంట్ కాదని, బ్రిటన్‌ని దెబ్బతీసిన ప్రమాదకర వేరియంట్లలో ఎరిస్ రెండోదని చెబుతోంది యూకే హెల్త్ విభాగం. అటు.. బ్రిటన్‌కి ఇరుగుపొరుగు దేశాల్లో, ముఖ్యంగా మిడిలీస్ట్ కంట్రీస్‌లో హైఅలర్ట్ మొదలైంది.
యూఎస్, జపాన్ దేశాల్లో ఇప్పటికే కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. జూలై 3న ఎరిస్ వేరియంట్ మొదటి కేసు నమోదైంది. బ్రిటన్‌లో ఎరిస్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. అత్యంత ప్రమాదకర వేరియంట్లలో ఎరిస్ రెండోది. బ్రిటన్‌కి ఇరుగుపొరుగు దేశాల్లో హైఎలర్ట్ జారీ చేశారు. ఇమ్యూనిటీ పెంచుకోవాలి’ అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.మరి ఇండియాక్కూడా మరోసారి కోవిడ్ ముప్పు తప్పదా? కొత్త వేవ్ ముంచుకొచ్చే ప్రమాదం ఎంతవరకుంది అనే చర్చ ఇక్కడ కూడా మొదలైంది. అధికపక్షం జనాభా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని కావల్సినంత ఇమ్యూనిటీ సాధించారని, ఒకవేళ ఎరిస్ వేరియంట్ ఇండియాకు చేరినా.. దాని వ్యాప్తి భయపడాల్సినంత స్థాయిలో ఉండబోదని చెబుతున్నారు. ఇమ్యూనిటీ మేనేజ్‌మెంట్ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని కూడా హెచ్చరిస్తున్నారు.
‘ఇప్పటివరకైతే కొత్త వేరియంట్ ఇండియాకి చేరుకోలేదు. మనదాకా వచ్చే ఛాన్స్ కూడా లేదనేది ఎక్స్‌పర్ట్స్ మాట. కానీ… ముందుజాగ్రత్తగా కోవిడ్ గైడ్‌లైన్స్ పాటించాల్సిందే అనే హెచ్చరికలున్నాయి. ఇన్‌ఫెక్షన్ సోకకుండా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలనే ఆదేశాలు త్వరలో వచ్చినా రావొచ్చు’ అని అమెరికాకు చెందిన డా. శరత్ అద్దంకి తెలిపారు.