రాష్ట్రంలో ఉన్న కుల వృత్తులకు పునర్జీవం పోసింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి మల్లా రెడ్డి అన్నారు. శనివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన బీసీ చేతి కులవృత్తులకు రు.లక్ష ఆర్థిక సహాయం చెక్కుల పంపిణి కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై లబ్దిదారులకు పంపిణి చేశారు.ఇ సందర్బంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తేలిపారు.
రాష్ట్రంలో 70 ఏండ్లలో ఎన్నో ప్రభుత్వాలు పలించాయని, కానీ కుల వృత్తులను పట్టించుకోలేదన్నారు. తొమ్మి దేండ్లలోనే వివిధ కులాలకు చేయూతనిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేసిన ఘనత బి ఆర్ ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వం అందచేసిన ఆర్థిక సహాయంతో వ్యాపారాలు చేసుకొని అభివృద్ధి చెందాలని బీసీ కులవృత్తిదారులకు సూచించారు. బీసీ లకు ఇచ్చె అర్ధిక సహాయం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని.. 15 కులాలకు చెందిన అర్హులైన వారికి పధకం వర్తింపచేస్తున్నామని వివరించారు.
కంటోన్మెంట్ మీదుగా పారడైస్ నుంచి సుచిత్రా వరకు, ప్యాటీనీ సెంటర్ నుంచి తుకుంట వరకు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని స్పష్టం చేసారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు ప్రణీత, చంద్ర రెడ్డి డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, జిల్లా వెనుక బడిన తరగతుల అభివృద్ధి అధికారి కేశురాం తదితరులు పాల్గొన్నారు.
245 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
జిల్లా కలెక్టరేటులో 245 మందికి మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా బి సి చేతి కులవృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం చెక్కులు పంపిణీ చేసారు. జిల్లా వ్యాప్తంగా 22077 రాగా ఇప్పటి వరకు 16600 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు అధికారులు వెల్లడించారు