బీసీ బిడ్డనైన నేను బిఆర్ఎస్ పార్టీలో ఇముడా లేనని పార్టీలో ఉండలేనని కమాన్ పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెంచికలపేట గ్రామానికి చెందిన అనావేన వేణు స్పష్టం చేశారు. సోమవారం కమాన్ పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… బిఆర్ స్ పార్టీవారు తమ ఇంటిపై దాడి చేసి కొట్టిన జడ్పీ చైర్మన్ పుట్ట మధు కు స్థానిక బిఆర్ స్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కి విన్నవించిన ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. పుట్ట మధు బీసీలు బీసీలు అంటూనే బీసీల పైన దాడి చేసిన పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురై బి ఆర్ ఎస్ మరియు ఏఎంసి డైరెక్టర్ కు రాజీనామా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
తమ రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి మరియు ఏఎంసీ డైరెక్టర్ పదవి రాజీనామాను వ్యవసాయ మార్కెట్ అధికారులకు పంపించడం జరుగుతుందని అన్నారు.తమకు విలువ ఇవ్వని పార్టీలో ఇక ఉండలేనని పేర్కొన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతానాన్ని అన్నారు. ఆయనతోపాటు అనవేన మల్లేష్ గడ్డం నాగేష్ సైతం బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.