యావత్ దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకొంటోంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతోంది. నేషన్ ఫస్ట్- ఆల్వేస్ ఫస్ట్.. అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకోనున్నారు దేశ ప్రజలందరూ. జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్‌ను రూపొందించింది ప్రభుత్వం. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధానిలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం, వైవిధ్యం.. అనే ఈ మూడు అంశాలకు దేశ ప్రజల కలలను సాకారం చేసే శక్తి ఉందని మోదీ చెప్పారు. వచ్చే అయిదేళ్లూ మావే: మోదీ ధీమా..!! ఇది మోదీ ప్రభుత్వం అని, ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతీక అని మోదీ పేర్కొన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే కాదు.. దాన్ని అనుకున్న సమయం కంటే ముందే ఛేదించడమూ తమకు తెలుసునని అన్నారు.
అలసిపోయే, ఆగిపోయే, ఓడిపోయే భారత్ కాదు.. ఇప్పుడున్నది ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రధాని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు. విశ్వకర్మల కోసం ప్రధాని మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. సంప్రదాయ చేతివృత్తుల వారిని ఆదుకోవడానికి, ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వారికి మెరుగైన జీవనాన్ని కల్పించడానికి, ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి దీన్ని ప్రారంభించబోతోన్నామని అన్నారు. 13,000 నుంచి 15,000 కోట్ల రూపాయలతో వచ్చే నెలలోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతోన్నామని ప్రధాని మోదీ చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీన విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు ఆర్థిక సాధికారతను కల్పిస్తామని అన్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనూ తానే ప్రసంగిస్తానంటూ మోదీ ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తానని తేల్చి చెప్పారు.
దేశం ఇంకా సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించాల్సి ఉందని, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడానికి వచ్చే అయిదేళ్ల కాలం అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. 2014లో ఏర్పడిన తమ ప్రభుత్వ పనితీరును చూసి 2019లో దేశ ప్రజలను తనను మరోసారి ఆశీర్వదించారని, ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని గుర్తు చేశారు. వచ్చే అయిదేళ్లల్లో అద్భుత ప్రగతిని సాధించాల్సి ఉందని పేర్కొన్నారు. 2047 కలను సాకారం చేసుకోవడానికి వచ్చే అయిదేళ్లే అత్యంత కీలకమని, అవి బంగారు క్షణాలని మోదీ చెప్పారు. 2024 ఆగస్టు 15వ తేదీన ఇదే ఎర్రకోట నుంచి దేశ విజయాలు, అభివృద్ధిని మీ ముందు ఉంచుతానని అన్నారు.నాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం, వైవిధ్యం.. అనే ఈ మూడు అంశాలకు దేశ ప్రజల కలలను సాకారం చేసే శక్తి ఉందని మోదీ చెప్పారు. మనం తీసుకునే నిర్ణయాలు, చేసే చర్యలు.. వచ్చే 1000 సంవత్సరాల్లో దేశ బంగారు చరిత్రకు అంకురార్పణ చేస్తుందని, చరితార్థం చేస్తుందని మోదీ పేర్కొన్నారు. 2014లో తాము అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ది 10వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు అయిదో స్థానానికి చేరుకున్నామని ప్రధాని మోదీ అన్నారు.
తన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయంటూ ప్రతిపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. దాని ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ పదో స్థానానికి దిగజారిందంటూ ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవ భారత నిర్మాణం జరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలనే చర్చ దేశంలో 25 సంవత్సరాలుగా సాగుతోందని, ఎవ్వరూ దాన్ని కార్యరూపంలోకి పెట్టలేకపోయారని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక గడువు కంటే ముందే కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించామని అన్నారు. ఇది మోదీ ప్రభుత్వం అని, ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతీక అని మోదీ పేర్కొన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే కాదు.. దాన్ని అనుకున్న సమయం కంటే ముందే ఛేదించడమూ తమకు తెలుసునని అన్నారు. అలసిపోయే, ఆగిపోయే, ఓడిపోయే భారత్ కాదు.. ఇప్పుడున్నది ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రధాని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.
బంగారు చరిత్రకు అంకురార్పణ
మణిపూర్‌లో చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితుల పట్ల స్పందించారు. దీనిపై మాట్లాడారు. మణిపూర్‌లో శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తోన్నట్లు చెప్పారు. యావత్ దేశం మణిపూర్ ప్రజలకు అండగా నిలుస్తుందని.. ఎర్రకోట వేదికగా భరోసా ఇచ్చారు. శాంతి ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తేల్చి చెప్పారు. మణిపూర్ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తోన్నాయని వివరించారు. ఈ సారి ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని అల్లకల్లోలానికి గురి చేశాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఊహకందని విధంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఈ కష్టకాలంలో బాధితులకు దేశ ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు. ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబాలకు మోదీ సానుభూతిని తెలియజేశారు.! జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం, వైవిధ్యం.. అనే ఈ మూడు అంశాలకు దేశ ప్రజల కలలను సాకారం చేసే శక్తి ఉందని మోదీ చెప్పారు. మనం తీసుకునే నిర్ణయాలు, చేసే చర్యలు.. వచ్చే 1000 సంవత్సరాల్లో దేశ బంగారు చరిత్రకు అంకురార్పణ చేస్తుందని, చరితార్థం చేస్తుందని మోదీ పేర్కొన్నారు.
చేతి కళకారులకు గుడ్ న్యూస్
మరోవైపు స్వాతంత్ర దినోత్సవం రోజు సంప్రదాయ కార్మికులు, హస్తకళాకారులకు మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. వారికోసం ‘విశ్వకర్మ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. స్వర్ణకారులు, కమ్మరులు, రజకలు, క్షురకులు, తాపీమేస్త్రీల కోసం వచ్చే కొన్ని రోజుల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు మోదీ వివరించారు.వీరిలో చాలావరకు ఓబీసీ కేటగిరీ కిందకు వస్తారని తెలిపారు మోదీ. తమ ప్రభుత్వం ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం ఆలోచిస్తోందన్న మోదీ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ఈ పథకాన్ని సెప్టెంబరు 17న ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.వచ్చే ఐదేళ్లలో దేశంలో పేదరికాన్ని నిర్మూలించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశాన్ని అగ్రగామిగా నిలుపుతామని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇక వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశం సాధించిన విజయాలను ఎర్రకోట నుంచి వివరిస్తానని మోదీ తెలిపారు. అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలిచి తాము విజయకేతనం ఎగురవేస్తామని మోదీ చెప్పకనే చెప్పారు.
10వ సారి జెండా ఎగురేసిన మోడీ
దేనికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. 77వ స్వాతంత్ర్య్ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 10వ సారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. త్రివర్ణ పతాకం ఆవిష్కరణ కంటే ముందుగా రాజ్‌ఘాట్ వద్ద జాతీపిత మహాత్మాగాంధీకి ప్రధాని నివాళులర్పించారు. దేశం నలుమూలల నుంచి 1800 మందిని అతిధులుగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆహ్వానించారు. వారిలో 400 మంది సర్పంచ్‌లు ఉన్నారు. స్వాతంత్ర్య వేడుకలకు 10వేల మందితో నాలుగంచెల ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆజాదీ కా అమృతోత్సవ వేడుకలు ముగియనున్నాయి.
ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని మోడీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ జెండా ఆవిష్కరణతో వరుసగా 10వసారి ఎర్రకోటపై మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ ప్రజలందరికీ ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదని.. దేశం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారన్నారు. అమరవీరుల త్యాగఫలితమే స్వాతంత్ర్యం. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని ప్రధాని మోడీ అన్నారు. ఎందరో త్యాగం ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. అమరవీరుల త్యాగ ఫలితమే స్వాతంత్ర్యమన్నారు. దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉందని.. అదే దేశాన్ని ముందుకు నడిపిస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. దేశంలో సుస్థిర, శక్తివంతమైన ప్రభుత్వం అవసరమని అన్నారు.
తమ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచారు కాబట్టే సంస్కరణలు తీసుకొచ్చామన్నారు.అవినీతి రాక్షసి దేశాన్ని వెనక్కి తీసుకెళ్లిందన్నారు. అవినీతి భూతం దేశాన్ని చాలా ఏళ్ళు పీడించిందని మోడీ గుర్తు చేశారు. సైన్యానికి వన్ ర్యాంక్, వన్ పెన్షన్ కోసం రూ. 70వేల కోట్లను ఖర్చు చేశామన్నారు. ఈ నెలలోనే విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించనున్నామని ప్రధాని ఎర్రకోట నుంచి ప్రకటించారు. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు ఇంటర్నెట్‌ను అందిస్తున్నామని మోడీ ప్రకటించారు. ఐదేళ్లల్లో పండున్నరకోట్ల మందిని దారిద్ర్యం నుంచి బయటపడేశామన్నారు. న్యూ ఇండియా అన్‌స్టాపుబుల్‌గా మారిందన్నారు. భారత్‌ను ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తి దేశంగా తయారు చేయనున్నామని ప్రధాని తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది మహిళా పైలట్లు ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. ప్రపంచం మొత్తం ద్రవోల్బణంతో ఇబ్బందులు పడుతుందని.. కానీ ఇండియాను ద్రవోల్బణం నుంచి బయటపడేశామన్నారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లోనూ అభివృద్ధి సాధిస్తున్నాయని ప్రధాని మోడీ తెలిపారు.