lakdi ka pool
తెలంగాణ ముఖ్యాంశాలు

సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా..ఉద్రిక్తత

సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ… ఉద్యోగులు చేపట్టిన లకిడికపుల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చిన ఉద్యోగులు కార్యాలయం ముందు రోడ్డు పై బైఠాయించారు. మద్దతుగా వచ్చిన రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అర్. కృష్ణయ్య, పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ ను అరెస్టు చేసేందుకు యత్నించడం తో ఉద్యోగులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేయడంతో… పోలీసులకు, ఉద్యోగులకు తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరగడంతో పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. కొద్దిసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  ఉద్యోగ భద్రత కల్పించి… మినిమం టైమ్ స్కెల్ అమలు చేస్తూ… హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.