తెలంగాణ ముఖ్యాంశాలు

దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో స్వాతంత్ర్య వేడుకలు

దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ‘భారత స్వాతంత్ర దినోత్సవం’ పురస్కారంచుకోని మున్సిపల్ కార్యాలయంలో, అహ్మద్‌గూడ వార్డు కార్యాలయంలో చైర్‌పర్సన్‌ వాసుపతి ప్రణీత శ్రీకాంత్‌గౌడ్‌ జాతీయ జెండాను ఆవిష్కరిం చారు. చైర్ పర్సన్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య భారత దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్రిటిష్ వారితో పోరాడి ప్రాణాలకు తెగించి భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన అమర వీరులను గుర్తు చేస్తూ వారికి జోహార్లు అర్పించరు. వందేమాతరం, భరత మాతకు జై అంటూ నినాదాలు చేసారు. అనంతరం మున్సిపల్ సిబ్బంధికి స్వీట్లు, పండ్లు పంపిని చేసారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ మాదిరెడ్డి నరేందర్‌రెడ్డి, కమిషనర్‌ రాజా మల్లయ్య, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.