bjp
తెలంగాణ రాజకీయం

కాంగ్రెస్ బాటలో బీజేపీ..! రేపటి నుంచి ఆశావహుల నుంచి దరఖాస్తులు..

తెలంగాణ బీజేపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. పోటీచేసే వారి నుంచి రేపటి (సోమవారం) నుంచి దరఖాస్తులు స్వీకరించాలని బీజేపీ నిర్ణయించింది. 4వ తారీఖు నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని, ఇందు కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ బీజేపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. పోటీచేసే వారి నుంచి రేపటి (సోమవారం) నుంచి దరఖాస్తులు స్వీకరించాలని బీజేపీ నిర్ణయించింది. 4వ తారీఖు నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని, ఇందు కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

బీజేపీలో టికెట్ కోసం పెద్ద సంఖ్యలో ఆశావాహులు ఉన్నారు. ఈసారి తమకు కూడా అవకాశం ఇవ్వాలని యువ నేతలు, మహిళలు అభ్యర్థిస్తున్నారు. ఇదిలావుండగా దరఖాస్తుల పరిశీలన కోసం స్ర్కీనింగ్ కమిటీ నియామకం చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు పేర్లతో జాతీయ నాయకత్వానికి నివేదిక అందించనున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.